ఒమిక్రాన్ ఎఫెక్ట్: నుమాయిష్ పూర్తిగా రద్దు

ఒమిక్రాన్ ఎఫెక్ట్: నుమాయిష్ పూర్తిగా రద్దు

హైదరాబాద్​ నాంపల్లిలో ఏటా 45 రోజుల పాటు జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్​ ఈ సారి అర్ధంతరంగా నిలిచిపోయింది. కరోనా వ్యాప్తి ఉధృతం కావడంతో ఎగ్జిబిషన్ ను పూర్తిగా రద్దు చేసింది ఎగ్జిబిషన్ సొసైటీ. జనవరి1న ప్రారంభమైన నుమాయిష్.. జనవరి 2 వ తేదీ వరకు కొనసాగినా.. అదే రోజు రాత్రి నుంచి జనవరి 10 వరకు  మూసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం కరోన కేసులు పెరిగిపోతుండడంతో  ఈ ఏడాది నుమాయిష్ ను నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది ఎగ్జిబిషన్ సొసైటీ.

45 రోజుల పాటు కొనసాగాల్సిన నుమాయిష్ కేవలం రెండు రోజులకే మూత పడటంతో ... దూర ప్రాంతాల నుంచి వచ్చిన స్టాల్స్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

మరిన్ని వార్తల కోసం..

రానున్న రోజుల్లో 90 శాతం ఒమిక్రాన్ కేసులు