ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 6.5 శాతం

ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 6.5 శాతం

ఢిల్లీలో కరోనా కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉన్నట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో కరోనా పాజిటివ్ వచ్చిన శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపిన వాటిలో 84 శాతం ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చాయన్నారు. ఢిల్లీలో నిన్న 3,194 కేసులు నమోదయ్యాయని, ఇవాళ ఆ సంఖ్య 4 వేలు దాటొచ్చని అంచనా వేస్తున్నామని అన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం పాజిటివిటీ రేట్ 6.5శాతంగా ఉందని చెప్పారు. ఢిల్లీలోని ఆస్పత్రులు, క్లినిక్‌లలో అన్ని రకాల వసతులు ఉన్నాయని, వైద్య సిబ్బంది కొరత కూడా లేదని తెలిపారు సత్యేంద్ర జైన్. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పరిస్థితి కంట్రోల్‌లోనే ఉందని చెప్పారు. కరోనా సోకిన వారిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారని, ఆస్పత్రిపాలవుతున్న వారి సంఖ్య తక్కువేనని అన్నారు.