లక్నో: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో పెద్దగా ప్రమాదమేమీ లేదని ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, అయితే దీని వల్ల వైరల్ ఫీవర్ తప్ప పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ లేవన్నారు. కాబట్టి ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దని సూచించారు. డెల్టాతో పోల్చుకుంటే ఒమిక్రాన్ వేరియంట్ అంత డేంజర్ కాదని యోగి అన్నారు. ఒమిక్రాన్ బారిన పడిన వాళ్లు నాలుగు నుంచి ఐదు రోజుల్లో పూర్తిగా కోలుకుంటున్నారని చెప్పారు.
#WATCH | #Omicron spreads fast but causes very mild disease. The virus has weakened. It is like viral fever but precautions are necessary. However, there is no need to panic: UP Chief Minister Yogi Adityanath pic.twitter.com/bpepHZzRwz
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 3, 2022
‘ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. కానీ దీని వల్ల భయపడాల్సిందేమీ లేదు. ఒమిక్రాన్ తో సామాన్యమైన వైరల్ ఫీవర్ లాంటివి వస్తాయ్. తప్పితే పెద్దగా ప్రమాదమేమీ లేదు. కానీ ఏ వ్యాధిని ఎదుర్కోవాలన్నా అప్రమత్తత, జాగరూకత అవసరం. ఒమిక్రాన్ బారిన పడిన వారు త్వరగా కోలుకుంటున్నారు. ఈ వేరియంట్ క్రమంగా బలహీనపడుతోంది. ప్రజలు కొవిడ్ రూల్స్ పాటించాలి’ అని యోగి ఆదిత్యనాథ్ సూచించారు.