13 ఏళ్ళ తర్వాత టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. దీంతో దేశవ్యాప్తంగా సెలెబ్రేషన్స్ ఆకాశాన్ని దాటేశాయి. మోదీతో సమావేశం అనంతరం ముంబై చేరిన రోహిత్ సేన.. బీసీసీఐ ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొంది. క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్సుపై ఊరేగుతూ అభిమానులతో కలిసి విజయాన్ని జరుపుకున్నారు. దీన్ని తిలకించేందుకు లక్షలాది మంది అభిమానులు ముంబై సముద్రపు ఒడ్డుకు విచ్చేశారు.
నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఇసుకేస్తే రాలనంత జన ప్రభంజనాన్ని తలపించింది. అభిమానులు టీమిండియా క్రికెటర్లను చూసేందుకు ఎగబడ్డారు. తమ ఫేవరేట్ క్రికెటర్లను చూసేందుకు రాష్ట్రాలు దాటి మరీ రావడం విశేషం. వారిలో యువకుడు ఓంకార్. ఇతను సోలార్ పూర్ నుంచి విరాట్ కోహ్లీని చూడడానికి వచ్చాడట. కోహ్లీ కనపడకపోయేసరికీ బోరుమని ఏడ్చాడు. ముంబైలోని వాంఖడే స్టేడియం బయట వేల మంది అభిమానుల మధ్య చిన్నపిల్లాడిలా గుక్క పట్టి ఏడ్చాడు. తన బాధను మీడియాకు చెబుతూ వాపోయాడు.
విక్టరీ పరేడ్ అనుకున్న షెడ్యూల్ (సాయంత్రం 5 గంటలకు) కంటే విజయయాత్ర రెండు గంటలు ఆలస్యంగా (రాత్రి 7.30 గంటలకు) మొదలైంది. అయినప్పటికీ అభిమానులు తాము ఆరాధించే ఆటగాళ్ల కోసం గంటల తరబడి వేచి చూశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిరీక్షించారు. ఇక ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్ మొదలయ్యాక ఆటగాళ్లకు అడుగడుగునా జననీరాజనమే. ఈ క్రమంలో అభిమానులు.. తమ అభిమాన క్రికెటర్లను దగ్గర నుంచి చూసేందుకు పోటీపడ్డారు.
muffa bhai, koi baat nahi. 😭
— Vickey (@ftwvickey7) July 4, 2024
pic.twitter.com/BSMcQLbinB