ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

తుంగతుర్తి, వెలుగు : ఈ నెల 23న సూర్యాపేట జిల్లా మునగాలలో జరిగే రైతు సంఘం జిల్లా మహాసభలను సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లు నాగార్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కోరారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఆదివారం రైతు సంఘం నాయకులతో జరిగిన  మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. భారీ  వర్షాలు పడుతుండడంతో పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, నాయకులు పులుసు సత్యం, ఉప్పలయ్య, శ్రీనివాస్, లక్ష్మి, వనం సోమయ్య పాల్గొన్నారు. 

కనులపండువగా కంఠమహేశ్వరుడి  కల్యాణం
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని కంఠమహేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం కంఠమహేశ్వరుడు, సురమాంబ కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో తరలివచ్చి నైవేధ్యం సమర్పించారు. ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గౌడ కులస్తులు మోకు ముస్తాదులకు పూజలు చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీపీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్య, టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వామివారిని దర్శించుకున్నారు. బీసీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూజార్ల శంభయ్య, నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాచకొండ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొండ జానయ్యగౌడ్,  శ్రీను, మురారిశెట్టి కృష్ణమూర్తి తదితరులు 
పాల్గొన్నారు.

నన్ను ఆపేశక్తి ఎవరికీ లేదు:బీజేపీ క్యాండిడేట్‌‌ కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి
చండూరు, వెలుగు : ‘నాకు ఇంత మంది మహిళల ఆదరణ ఉంది, ఇక నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు’ అని బీజేపీ క్యాండిడేట్‌‌ కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చండూరులో ఆదివారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వృద్ధుల ఆరోగ్య పరిస్థితి, చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత చండూరులో రోడ్‌‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడులో జరిగేది నియంతపాలనను అంతమొందించే ధర్మయుద్ధమన్నారు. నియోజకవర్గ సమస్యలు చెప్పుకుందామని మూడున్నరేండ్లు ఎదురుచూసినా సీఎం కేసీఆర్‌‌ అపాయింట్‌‌మెంట్‌‌ ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్‌‌ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని అన్యాయంగా టీఆర్‌‌ఎస్‌‌లో చేర్చున్నాడని విమర్శించారు. ఉద్యమం జరిగే టైంలో డబ్బుల కోసం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌రావు, సంతోష్‌‌రావు తన చుట్టూ తిరిగారని ఆరోపించారు. తాను రాజకీయాల్లోకి రాకముందు తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో సాయం చేశానని చెప్పారు. సిద్ధిపేటకు రూ. 710 కోట్లు, గజ్వేల్‌‌కు రూ. 650 కోట్లు ఖర్చు చేస్తే మునుగోడుకు మాత్రం కేవలం రూ. 2 కోట్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నిక రెండు పార్టీల మధ్య యుద్ధం కాదని, కేసీఆర్‌‌ కుటుంబానికి, మునుగోడు ప్రజలకు మధ్య జరుగుతున్న ధర్మయుద్ధం అని అన్నారు. ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌‌ను చిత్తుగా ఓడించాలని సూచించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, కోడిగిరి బాబు, కోమటి వీరేశం, అనపర్తి యాదగిరి, కోడి శ్రీనివాస్, కొత్తపాట సతీశ్‌‌ పాల్గొన్నారు.

పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు పెట్టాలి
మునుగోడు, వెలుగు : కొత్త పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు పెట్టాలని ఎస్సీ, ఎస్టీ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నామకరణ జాతీయ కమిటీ సభ్యుడు కె.మహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. నల్గొండ జిల్లా చండూరులో ఆదివారం ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపినా స్పందించడం లేదన్నారు. కేంద్రం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. వచ్చే నెలలో ఐదు లక్షల మందితో కొంగరకలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అద్దంకి జ్యోతి, జుగుంట్ల శ్రీనివాసరావు, రాజశేఖర్, బెల్లం బాలశివరాజు, నరసింగరావు, 
పాల్గొన్నారు.

ప్రశాంతంగాగ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. యాదాద్రి జిల్లాలో 3,644 మంది ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయాల్సి ఉండగా 2,921 మంది హాజరయ్యారు. సూర్యాపేటలో 9,181 మందికి 7,471 మంది, నల్గొండలో 16,084 మందికి 13,195 మంది ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాశారు. ఈ సారి బయోమెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానం అమలు చేయడంతో ఉదయం 8.30 గంటల నుంచి క్యాండిడేట్లను ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లలోకి అనుమతించారు. 10.15 గంటలకు గేట్లు క్లోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో 10.15 తర్వాత వచ్చిన క్యాండిడేట్లను ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుమతించలేదు. ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లను ఆఫీసర్లు తనిఖీ చేశారు. 
యాదాద్రి/సూర్యాపేట/నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, - వెలుగు 

టీఆర్‌‌ఎస్‌‌ను అడ్డుకోవడం బీజేపీతోనే సాధ్యం
చండూరు (మర్రిగూడ), వెలుగు :
కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన భార్య లక్ష్మీ రాజగోపాల్‌‌రెడ్డి కోరారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో ఆమె ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లిల్లూ తిరుగుతూ రాజగోపాల్‌‌రెడ్డి రాజీనామా చేసేందుకు కారణమైన పరిస్థితులను వివరించారు. సుశీలమ్మ ఫౌండేషన్‌‌ ఆధ్వర్యంలో కరోనా టైంలో 50 వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారని గుర్తు చేశారు. కేసీఆర్‌‌ నియంత పాలనను అడ్డుకోవడం బీజేపీతోనే సాధ్యం అవుతుందన్నారు. ఆమె వెంట కంకణాల నివేదితారెడ్డి, తుల ఉమ, కొండ విశ్వేశ్వర్‌‌రెడ్డి, రాకేశ్‌‌రెడ్డి, యాస అమరేందర్‌‌రెడ్డి పాల్గొన్నారు.

స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆర్థికసాయం
యాదాద్రి, వెలుగు : ఆపదలో ఉన్న వారిని సాధ్యమైనంత వరకు ఆదుకుంటానని టీపీసీసీ మెంబర్, ఆలేరు నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి బీర్ల అయిలయ్య చెప్పారు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం మందనపల్లికి చెందిన స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేజస్వి తండ్రి అనారోగ్యం బారిన పడుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విషయం తెలుసుకున్న బీర్ల అయిలయ్య ఆదివారం తేజస్వినికి ఆర్థికసాయం అందజేశారు. ఆమె తండ్రికి వైద్య సాయం అందించడంతో పాటు, కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు వెంకటశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజు, నోముల వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కడకంచి పద్మ, రాజు, సోములు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలి
తుంగతుర్తి, వెలుగు : ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కాంతారావు, నాయకులు ఓరుగంటి సత్యనారాయణ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధన కోసం ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు కోసం రాష్ట్రంలో లీడర్లు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బండారు దయాకర్, ఓరుగంటి అంతయ్య, పాలవరపు సంతోశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బండారు సోమన్న, సత్యనారాయణ, ఓరుగంటి శ్రీనివాస్, సుభాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.