నిజామాబాద్లో వందకే కిలో చికెన్​

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్​వేజ్​ ప్రియులు ముక్క లేనిదే ముద్ద ముట్టరు. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల తరఫున వారి అభిమానులు రూ.100కే కేజీ చికెన్ విక్రయించడంతో కొనడానికి జనాలు గంటల తరబడి బారులు తీరారు. మార్కెట్​లో రూ.180 కి బదులు ఇక్కడ రూ.వంద అమ్మడంతో అమ్మడంతో జనం ఎగబడ్డారు.

పొలిటికల్​ ఆఫర్ గా సీఎం రేవంత్ రెడ్డి, అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అభిమానులు వారి అభిమాన నాయకుల ఫొటోలు పెట్టి నిజామాబాద్ వీక్లీ మార్కెట్ లో ఇలా చికెన్​విక్రయించారు.
– వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్