తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మార్నింగ్ వాక్‌లో ఓ సరదగా సంఘటన ఎదురైంది. ఆయన వాకింగ్ చేస్తుండగా ఎదురైన కొందరు ప్రజలతో ఆయన ఆగి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనను ఓ మహిళ అడిగి ప్రశ్నకు సిగ్గుపడుతూ నవ్వేసి.. మెల్లిగా సమాధానం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను డీఎంకే పార్టీ తన అధికారిక ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్అవుతోంది.
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் @mkstalin அவர்கள், இன்று காலை அடையாறு பகுதியில் நடைப்பயிற்சி மேற்கொண்டபோது, "திமுக ஆட்சியால் மிகுந்த மகிழ்ச்சி அடைந்து இருக்கிறோம்" என பொதுமக்கள் தெரிவித்தனர்!
— DMK (@arivalayam) September 21, 2021
'A leader knows the way, goes the way, and shows the way!'#ChiefMinisterMKStalin pic.twitter.com/PGbrLR8uHp
ఈ రోజు (మంగళవారం) ఉదయం సీఎం స్టాలిన్ చెన్నైలోని అడయార్ ఏరియాలో వాకింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఎదురైన ప్రజలతో ఆయన మాట్లాడుతుండగా.. వాళ్లంతా డీఎంకే పాలనపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సార్ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అంటూ ఓ సరదా ప్రశ్న వేసింది. మీరు 68 ఏండ్ల వయసులోనూ ఇలా యంగ్‌గా, ఫిట్‌గా ఎలా ఉన్నారని అడింది. ఈ యూత్‌ఫుల్ లుక్ వెనుక సీక్రెట్ ఏంటని ప్రశ్నించింది. దీంతో ఆయన ఒక్కసారిగా సిగ్గుపడుతూ నవ్వేసి.. ‘‘డైట్ కంట్రోల్ వల్లే” అంటూ స్టాలిన్ సమాధానం చెప్పారు.