న్యూఢిల్లీ: ఇమ్మిగ్రెంట్ల అంశం అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు.. ఎలాన్ మస్క్ మధ్య చిచ్చు రేపుతున్నది. అమెరికా ఫస్ట్ విధానానికి కట్టుబడి ఉండాలని.. ఇమ్మిగ్రెంట్స్‌కు అడ్డుకట్టవేయాలని మాగా(మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) క్యాంప్ వాదిస్తున్నది. అయితే టాలెంట్ఉన్న ఇమ్మిగ్రెంట్స్ను అమెరికా రానివ్వకపోతే సాంకేతికంగా వెనకబడతామని మస్క్అంటున్నారు. మస్క్‌కు రిపబ్లికన్ లీడర్వివేక్రామస్వామి, ఇతర టెక్ కంపెనీల నుంచి సపోర్ట్‌గా దక్కుతున్నది.
శ్రీరామ్ కృష్ణన్ఎంపికపై వివాదం
జనవరి 20న ప్రెసిడెంట్‌గా ప్రమాణం చేయనున్న ట్రంప్ తన కార్యవర్గాన్ని నియమించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఐదుగురు ఇండియన్ అమెరికన్లకు కీలకమైన బాధ్యతలు దక్కాయి. ఏఐ పాలసీ అడ్వైజర్‌గా మస్క్స్నేహితుడు, వెంచర్ క్యాప్టలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్‌ను ట్రంప్ నియమించారు. స్కిల్స్ కలిగిన వలసదారుల కోసం గ్రీన్ కార్డ్‌లపై ఉన్న పరిమితిని తొలగించాలంటూ గతంలో కృష్ణన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నియామకంపై ట్రంప్‌కు బలమైన సపోర్టర్స్ అయిన మాగా క్యాంప్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. హెచ్1బీ వీసాపై దక్షిణాఫ్రికా నుంచి అమెరికా వలస వచ్చిన మస్క్ మాగా క్యాంప్ తీరును వ్యతిరేకిస్తున్నారు. అత్యుత్తమ టాలెంట్ ప్రపంచంలో ఎక్కడున్న తీసుకోవాలని చెప్తున్నారు.
‘‘మీ టీమ్ విజయం సాధించాలని కోరుకుంటే టాప్ టాలెంట్ ఉన్న వారు ఎక్కడున్నా రిక్రూట్ చేసుకోవాలి’’ అని మస్క్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. మస్క్ వాదనను వివేక్ రామస్వామి సమర్థించారు. అమెరికా కల్చర్‌లో ఉన్న లోటుపాట్లను చూపిస్తూ ‘ఎక్స్’లో మెసేజ్ పోస్ట్ చేశారు. అమెరికన్ కల్చర్ బెస్ట్ ఇంజినీర్లను తయారుచేయడం లేదని.. అందుకే ప్రముఖ కంపెనీలు విదేశాల నుంచి ప్రతిభ, స్కిల్క్ ఉన్న వారిని నియమించకుంటున్నాయని తెలిపారు. అయితే వివేక్ కామెంట్లను అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఖండించారు. అమెరికాలో చాలా టాలెంట్ ఉందని.. దానిపై పెట్టుబడులకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.