
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రిలోని ఊరుమందమర్రి చెరువు ట్యాంక్ బండ్ పరిసరాల్లో మున్సిపల్ సిబ్బంది శనివారం ప్రత్యేకంగా క్లీనింగ్, బుషెస్ తొలగింపు పనులు చేపట్టారు. ఇటీవల ట్యాంక్బండ్ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సందర్శించగా, వాకర్స్అసోసియేషన్ప్రెసిడెంట్, కాంగ్రెస్ లీడర్ బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో వాకర్స్ పలు సమస్యలపై విన్నవించారు.
దీంతో ఎమ్మెల్యే ఆదేశాలతో మున్సిపల్కమిషనర్ తుంగపిండి రాజలింగు నేతృత్వంలో 30 మంది సిబ్బంది, రెండు జేసీబీ, ఒక బ్లేడ్ట్రాక్టర్ సహాయంతో శనివారం వాకింగ్ట్రాక్, పరిసరాలను క్లీన్ చేశారు. చెరువు, కట్టపై ఏపుగా పెరిగిన తుమ్మచెట్లు, పొదలను తొలగించారు. సోమవారం నాటికి పనులు పూర్తి చేస్తామని మున్సిపల్కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి వాకర్స్అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది.