గాంధీ జయంతి: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై GHMC చర్యలు

గాంధీ జయంతి: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై GHMC చర్యలు

మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా… హైదరాబాద్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాలు ప్రారంభించింది GHMC. వ్యాపారులు, ప్రజలు ఎవరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకుండా… కార్యాచరణ చేపట్టారు అధికారులు. సిటీ మొత్తం ప్లాస్టిక్ ఏరివేస్తున్నారు. 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తే జరిమానాలు వేస్తామని హెచ్చరించింది. సిటీలోని పార్క్ లు, పర్యాటక ప్రాంతాలు, ప్లే గ్రౌండ్స్, రోడ్లపై ప్లాస్టిక్ వ్యర్థాలను GHMC సిబ్బంది సేకరిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్టూడెంట్స్ కూడా ఈ ప్లాగింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ఉపయోగించబోమని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రమాణం చేశారు.