ఖమ్మం టౌన్/వైరా/ఎర్రుపాలెం/చండ్రుగొండ, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వేర్వేరు చోట్ల సోమవారం ‘ఇంటర్నేషనల్యాంటీ డ్రగ్స్ డే’ నిర్వహించారు. యువత చెడు అలవాట్లకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేశారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి జి.జ్యోతి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నాగేందర్ రెడ్డి, జిల్లా డ్రగ్స్ అధికారి ప్రసాద్, ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, క్రీడల అధికారి పరంధామ రెడ్డి, డాక్టర్సునీల్ కుమార్, ఎన్ సీసీ జిల్లా కన్వీనర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సర్దార్పటేల్స్టేడియం నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ALSO READ: బంగారం చోరీ కేసులో నలుగురు మహిళలు అరెస్ట్
వైరాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వైరాలో ‘సే నో టూ డ్రగ్స్’ అంటూ స్టూడెంట్లు, ప్రజాప్రతినిధులు, పోలీస్సిబ్బందితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మధిర క్రాస్ రోడ్ వద్ద ఏసీపీ రెహమాన్ ర్యాలీని ప్రారంభించారు. అక్కడ స్టూడెంట్లు మానవహారం నిర్వహించారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎస్సై సురేశ్పాల్గొన్నారు. యువత, స్టూడెంట్లు మత్తుకు దూరంగా ఉండాలని కోరుతూ చండ్రుగొండలో ప్రదర్శన నిర్వహించారు. ‘మిషన్ పరివర్తన’లో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో స్టూడెంట్లు స్థానిక జడ్పీ హై స్కూల్ నుంచి బస్టాండు సెంటరు మీదుగా మెయిన్ సెంటరు వరకు ర్యాలీ తీశారు.