డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు పోలీస్ బందోబస్త్

నిజామాబాద్, వెలుగు: నగర శివారులోని నాగారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సోమవారం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఇండ్లను ఆక్రమించేందుకు కొందరు పేద లు ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ పోలీస్ కాపలా పెట్టారు. సుమారు 400 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించిన గత ప్రభుత్వం, వాటిని అర్హులైన వారికి పంపిణీ చేయకుండా జాప్యం చేసింది.

ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్న కుటుంబాలు వాటి అప్పగింత కోసం ఎదురుచూస్తున్నాయి. పంపిణీ మరింత లేట్ అవుతుండడంతో ఆందోళన చెంది ఆక్రమణకు ప్రయత్నించారు. అర్ధరాత్రి  సామాన్లు తెచ్చి ఇండ్లలో పెట్టారు. సమాచారం అందుకున్న ఫిఫ్త్​ టౌన్ పోలీసులు చేరుకొని వారిని ఖాళీ చేయించారు. మరోసారి కబ్జా ప్రయత్నం జరగొచ్చనే అనుమానంతో పోలీసు బందోబస్తు పెట్టారు.