కొత్త ఉద్యోగులకు జాయినింగ్ లెటర్లు అందజేత

కోల్​బెల్ట్, వెలుగు: మెడికల్​ఇన్వాలిడేషన్ ​ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన యువతీయువకులకు సోమవారం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్​జాయినింగ్ ​లెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరియాలో ఇప్పటివరకు వారసత్వం ద్వారా 1647 మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏరియా ఏస్వోటు జీఎం ఎ.రాజేశ్వర్​రెడ్డి, పర్సనల్​మేనేజర్​శ్యాంసుందర్, సీనియర్​పీవో సత్యబోస్, ఓఎస్​ ముల్కల రాజలింగు తదితరులు పాల్గొన్నారు.

షావెల్ వెహికల్​ను ​ప్రారంభించిన జీఎం మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ఓపెన్​కాస్ట్​గనిలో కొత్తగా కోనుగోలు చేసిన మంజీరా షావెల్​ వెహికల్​ను జీఎం ఎం.మనోహర్ ప్రారంభించారు. కొత్త షావెల్​రాకతో ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి మరింత తోడ్పాటు అందుతుందన్నారు. ఓసీపీ పీవో ఎం.గోవిందరావు, మేనేజర్​ సీహెచ్ వెంకటేశ్వర్లు, ఇంజనీర్​ మహేందర్​ తదితరులు పాల్గొన్నారు.