ప్రజాపాలనకు వంద రోజులు.. ప్రజా నాయకుడికి చిరు కానుక

  • విస్తరాకులో సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల ప్రజాపాలన చిత్రం 

హైదరాబాద్: అమెరికాలో స్థిరపడిన ఓ ఆర్టిస్ట్ తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్న  అభిమానంతో..  ప్రజాపాలన వంద రోజులు పూర్తిచేసుకుంటున్న సందర్భం గా వినూత్న ఆర్ట్ ని వేశారు. మార్చి 15 న ప్రజాపాలనకు 100 రోజులు అయిన సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో(బే ఏరియా) ఉండే ప్రముఖ చిత్ర కారుడు అరవింద్ కొత్త సీఎంపై అభిమానంతో భారతీయ సంస్కృతిలో భాగమైన విస్తరాకును వినూత్న రీతిలో తీర్చిదిద్ది కానుకగా ఇచ్చారు. ఒక అరుదైన కళ ద్వారా శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అరవింద్ తన కళా నైపుణ్యంతో ఇలాంటి ఆర్ట్ ని వేసి గిఫ్ట్ గా ఇచ్చారు.