పోలీస్‌‌ అమరులను మరువొద్దు

తొర్రూరు, వెలుగు  :  పోలీస్‌‌ అమరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం మహబూబాబాద్‌‌ జిల్లా తొర్రూరులో పోలీసులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్‌‌అండ్‌‌బీ గెస్ట్‌‌ హౌజ్‌‌ ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వరబాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారిని మర్చిపోవొద్దని చెప్పారు. లా అండ్‌‌ ఆర్డర్‌‌ను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సైలు జగదీశ్‌‌, రాంజీనాయక్‌‌ పాల్గొన్నారు.