గుడ్ న్యూస్..ఎల్​జీ ప్రొడక్టులపై భారీ ఆఫర్లు

గుడ్ న్యూస్..ఎల్​జీ ప్రొడక్టులపై భారీ ఆఫర్లు

హైదరాబాద్​, వెలుగు:రిపబ్లిక్​ డే సందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ‘ద నేషన్ కాల్స్ ఫర్ సెలబ్రేషన్’ పేరుతో ప్రత్యేక సేల్​ ప్రారంభించింది.   కేవలం రూ.26 చెల్లించి మిగతా మొత్తాన్ని సులభమైన ఈఎంఐలలో చెల్లించవచ్చు. 

కొన్ని మోడళ్లపై 32.5శాతం వరకు క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్ (రూ.50 వేల వరకు ఆదా) ఇస్తారు. ఈఎంఐలు రూ.888 నుంచి మొదలవుతాయి. కొన్ని ఇన్​స్టా వ్యూ ఫ్రిజ్ మోడల్స్​ కొంటే రూ.11,999 విలువైన మినీ ఫ్రిజ్ ఉచితం. కొన్ని ఫ్రిజ్ మోడళ్లపై రూ.5,000 విలువైన 8 పీసెస్ బోరోసిల్​ గ్లాస్ లాక్ కిట్ ఉచితంగా ఇస్తారు. 

కొన్ని మైక్రోవేవ్ ఓవెన్ మోడళ్లపై గ్లాస్ బౌల్ కిట్ ఫ్రీగా ఇస్తారు. కొన్ని ఓఎల్​ఈడీ టీవీ మోడళ్లకు అదనపు వారంటీ ఇస్తారు. సౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బార్లపై 30 శాతం వరకు తగ్గింపు ఇస్తారు. కొన్ని ఓల్​ఈడీ టీవీ మోడళ్లకు 2 ఈఎంఐలను మాఫీ చేస్తారు.  కొన్ని ఎల్జీ ఎక్స్​బూమ్​ స్పీకర్ మోడళ్లకు ఉచితంగా మైక్ ఇస్తారు.