పరేడ్​ గ్రౌండ్లో ఆకట్టుకున్న మార్చ్​ఫాస్ట్

పరేడ్​ గ్రౌండ్లో ఆకట్టుకున్న మార్చ్​ఫాస్ట్
  • ఫస్ట్ టైమ్ అధికారిక వేడుకల్లో పాల్గొనడంపై ఉద్యమకారులు, అమరుల కుటుంబాల హర్షం 

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా సికింద్రాబాద్  పరేడ్​ గ్రౌండ్​లో చేపట్టిన మార్చ్ ఫాస్ట్  అందరినీ ఆకట్టుకుంది. సీఎం రేవంత్​ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించడంతో పరేడ్  మైదానంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సీఎం గౌరవ వందనం స్వీకరించారు. దాదాపు 12 నిమిషాల పాటు ఓపెన్ టాప్ జీపులో ముఖ్యమంత్రి పరేడ్‌‌ను పర్యవేక్షించారు. 20 నిమిషాల పాటు మార్చ్ పాస్ట్  నిర్వహించారు. ఇందులో 10 కాంటిజెంట్స్​ పాల్గొన్నాయి. 18 టీజీఎస్పీ బెటాలియన్లు, సిటీ ఆర్మ్​డ్​ రిజర్వ్, ఆక్టోపస్, మౌంటెడ్​ పోలీసు కార్, డిజస్టర్​ రెస్పాన్స్​ అండ్​ ఫైర్​ సర్వీసెస్, భారత్​ స్కౌట్స్, రెసిడెన్షియల్​ స్కూల్స్​ మార్చ్​ఫాస్ట్​లో పాల్గొన్నాయి. వేడుకకు అమరవీరుల కుటుంబాలు,  ఉద్యమకారులు హాజరయ్యారు. కాగా.. వేడకులకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్​కు, బీజేపీ లీడర్లకు ఆహ్వానం పంపినా హాజరు కాలేదు. మొదటిసారి అధికారిక వేడుకలో పాల్గొన్నందుకు ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు.