మొక్కు తీర్చుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే

మొక్కు తీర్చుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే

జడ్చర్ల/బాలానగర్, వెలుగు: ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​రెడ్డి ఆదివారం పలు ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. జడ్చర్ల, బాలానగర్, నవాబుపేట మండలాల్లోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. బాలానగర్​ మండలం పెద్దాయపల్లి అయ్యప్ప టెంపుల్, నవాబుపేట మండలం పర్వతాపూర్, జడ్చర్ల మండలంలోని దర్గా, ఈద్గాతో పాటు మీనాంబరం పరుశవేదీశ్వర స్వామి ఆలయం, గంగాపూర్​ చెన్నకేశవ స్వా మి టెంపుల్​లో పూజలు చేశారు.

బాదేపల్లి పట్టణంలోని శివాలయంతో పాటు రాఘవేంద్ర స్వామి ఆలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజా సమ స్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు.

భూ కబ్జాలు లేకుండా, అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు.

మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీతో పాటు రాజీవ్​ ఆరోగ్యశ్రీ లిమిట్​ను రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. రాష్ట్ర యూత్​ కాంగ్రెస్​  సెక్రటరీ తూడి అనిల్​రెడ్డి, యూత్​ కాం గ్రెస్​ పట్టణ అధ్యక్షుడు గంట వంశీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నిత్యానందం, బాలానగర్, జడ్చర్ల, నవాబుపేట మండల పార్టీ అద్యక్షులు శంకర్​నాయక్, బూర్ల వెంకటయ్య, రాంచంద్రయ్య, వక్ఫ్​బోర్డు జిల్లా మాజీ చైర్మన్​ మహ్మద్​గౌస్​ రబ్బాని, మీనాజ్, తిరుపతి, జనార్ధన్ రెడ్డి, అశోక్​యాదవ్, బుక్క వెంకటేశం, సర్ఫరాజ్, వహీద్, యాదయ్య, బుచ్చన్న, ఖాజా, ఫాహాద్, ఖాజమైనోద్దిన్​ పాల్గొన్నారు.