ప్రియాంక వ్యాఖ్యలపై మాయావతి కౌంటర్ 

ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ దిగ్గజాలు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రియాంక గాంధీపై విమర్శలు చేశారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి ప్రియాంక చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ బీజేపీ యేతర ఓట్లను మాత్రమే చీలుస్తుందన్నారు. యూపీలో కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా తయారైందని..గంటల వ్యవధిలోనే సీఎం అభ్యర్థి పై స్టాండ్ మార్చుకున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లాంటి పార్టీలను యూపీ ప్రజలు నమ్మరన్నారు. ఓట్ల కోసమే పనిచేస్తాయని వారికి అర్థమైందని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం
త్వరలో ఢిల్లీ హెల్త్ మినిస్టర్ అరెస్ట్

ఎస్పీలోకి మరో ఇద్దరు హస్తం నేతలు జంప్