ఆ ఏడుగురు హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. నాలుగేళ్లనుంచో ఐదేళ్ల నుంచో కాదు. 20 ఏళ్లకు పైగా జైల్లోనే ఉంటున్నారు.సాదా సీదా కేసు కాదు. మాజీ ప్రధానిరాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా కోర్టు తేల్చి చెప్పడంతో మరణ శిక్ష పడ్డ వాళ్లు. మురుగన్,శంతన్, పెరారివాలన్, నళిని,రవిచంద్రన్, రాబర్ట్ పేస్,జయకుమార్. 2014 లో వీరి మరణశిక్షను సుప్రీం కోర్టు యావజ్జీవశిక్షగా మార్చింది. వీరిని విడుదల చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని గతంలో సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.ఈ ఏడుగురి విడుదలకు రూట్ క్లియర్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఓ తీర్మానం కూడా చేసిం ది. అయితే వీరి రిలీజ్ కు న్యాయపరమైన అనేక అడ్డంకులు వచ్చాయి. కాలక్రమంలో ఒక్కో అడ్డంకి తొలగిపోయింది. చివరకు తమిళనాడు గవర్నర్ సంతకం దగ్గర ఈ ఏడుగురి విడుదలకు సంబంధించిన ఫైల్ ఆగి పోయిం ది. దీంతో వీరి విడుదలపై అయోమయ స్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ఏడుగురు ఖైదీల విడుదల అంశం తమిళనాడులో తెరమీదకువస్తుంది. ఈసారి కూడా అదే జరిగిం ది. ఈ అంశాన్ని డీఎంకే చీఫ్ స్టాలిన్ అయితే ఏకంగా వీరి విడుదల హామీ అంశాన్ని మేనిఫెస్టోలోనే పెట్టేశారు.నళిని టీం విడుదల అంశం తెరమీదకు రాగానే అప్పటివరకు కాచుకు కూర్చున్న కొంతమంది సడన్ గా సీన్ లోకి ఎంట్రీ ఇస్తారు. ‘ రాజీవ్ ను హత్య చేసిన వారిపై దయ చూపాల్సిన అవసరం లేదంటూ ’ కొత్తవాదనలు మొదలెడతారు. ‘‘మనం ఒక నాగరిక సమాజంలో బతుకుతున్న విషయాన్ని వీరు మరచిపోతారు. శిక్షలు, మనుషుల్లో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడాలన్న సంగతి పట్టించుకోరు”అని వీళ్లు వాదిస్తారు. ఏ శిక్ష కైనా ఒక కాల పరిమితి ఉంటుంది. దోషులుగా తేలినంత మాత్రాన బతికినంత కాలం జైల్లోనే ఉంచాలని ఏ న్యాయసూత్రం పేర్కొనలేదని వాదిం చే వాళ్లూ ఉన్నారు.సహజంగా యావజ్జీవ శిక్ష పడ్డవారిని జైల్లో ప్రవర్తన ఆధారంగా ముందుగా విడుదల చేస్తారు. అయితే రాజీవ్ హంతకుల విషయంలో ఈ సహజ న్యాయసూత్రం అటకెక్కిందని కొంతమంది అంటున్నారు. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళిని టీం జైల్లో మంచి ప్రవర్తనతో ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నా యంటున్నారు. పెరారివాలన్ అయితే చక్కగా చదువుకున్నా డు. జైల్లో శిక్ష అనుభవిస్తూనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లోఅనేక కోర్సు లు పూర్తి చేశారన్నా రు. అంతేకాదు తోటిఖైదీలు చదువుకోవడానికి వీలుగా జైల్లో ఓ లైబ్రరీనికూడా ఏర్పాటు చేయించాడన్నా రు. తాను లైబ్రేరియన్లా పనిచేస్తూ సాటి ఖైదీలకు అవసరమైన పుస్తకాలు అందేలా చూడటంలో సాయపడ్డాడని గుర్తు చేశారు.ఇలాం టి మంచి ప్రవర్తన ఉన్న వారిని ఎందుకు విడుదల చేయరన్నది వారి ప్రశ్న. రెండు దశాబ్దా లకుపైగా జైలు శిక్ష అనుభవిస్తు న్న వీరి విడుదలకు ఉన్నఅడ్డం కులన్నీ ఒక్కటొక్కటిగా తొలిగాయి. ప్రస్తు తంతమిళనాడు గవర్నర్ సంతకం దగ్గర ఈ ఏడుగురివిడుదల ఇష్యూ ఆగిపోయిం ది.
2014 లో జయలలిత ప్రతిపాదన
ఈ ఏడుగురి విడుదల కు 2014 ఫిబ్రవరిలో అప్పటితమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఓ ప్రతిపాదనచేశారు. ఈ ఇష్యూపై అభిప్రాయం చెప్పాలంటూ అప్పటి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి లెటర్ రాశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం , సుప్రీంకోర్టుకెళ్లిం ది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుం డా రాష్ట్రా లు ఏకపక్షంగా ఇలాం టి నిర్ణయాలు తీసుకోరాదని సుప్రీంకోర్టు పేర్కొం ది. తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనను కొట్టి వేసిం ది. ఇదే అంశం పై 2016 లో తమిళనాడు ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టు గడపతొక్కిం ది.రాష్ట్ర ప్రభుత్వ తీర్మానానికి మద్దతు పలుకుతూ గవర్నర్ సంతకం పెడితే ఏడుగురిని విడుదల చేయవచ్చనిసుప్రీం కోర్టు పేర్కొం ది.
తీర్మానం చేసి ఆర్నెల్లు దాటింది
రాజీవ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తు న్న ఏడుగురి విడుదలకు సంబంధించి తమిళనాడు కేబినెట్ తీర్మానంచేసి ఇప్పటికి ఆర్నెల్లు దాటిం ది. ఇందుకు సంబంధించిన ఫైలుపై గవర్నర్ ఒక్క సంతకం పెడితే చాలు.ఏడుగురు జైలు నుంచి విడుదలవుతారు. మిగిలిన జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇప్పటికైనా గవర్నర్ మౌనముద్ర వీడాలని పెరారివాలన్ తల్లి అర్పు తం అమ్మాళ్ కోరారు. 71 ఏళ్లవయసులో ఉన్న అర్పు తం జీవితపు చివరి రోజుల్లోతన కొడుకు దగ్గర ఉండాలని కోరుకుంటున్నారు.న్యా యపరమైన అన్ని అడ్డం కులు పూర్తయ్యాయికాబట్టి ఇప్పటికైనా గవర్నర్ పెద్ద మనసు చేసుకునివిడుదల ఫైల్ పై సంతకం పెట్టా లని కోరుతున్నా రు.తన బిడ్డలాంటి మరో ఆరుగురికి కొత్త జీవితం ప్రసాదిం చాలన్నారు.
ఎల్టీ టీ ఈ…
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీ ఈ)పేరుతో ఓ వేర్పాటు వాద సంస్థను 1976 మే 5నవేలుపిళ్లై ప్రభాకరన్ ఏర్పాటు చేశాడు. శ్రీలంకలోస్వతంత్ర తమిళ రాష్ట్రం ఏర్పాటు ఈ సంస్థ లక్ష్యం.ఎల్టీటీ ఈ కార్యకర్తలు టైగర్లుగా పాపులర్. ఆత్మాహుతిబాం బు దాడులకు ఈ సంస్థ మరో పేరుగా మారిం ది.తమ డిమాం డ్ల సాధన కోసం శ్రీలంక ప్రభుత్వం తోఅనేక సార్లు ఎల్టీటీ ఈ చర్చలు జరిపిం ది.అయితే రకరకాల కారణాలతో ఈ చర్చలు ఫెయిల్ అయ్యాయి.ఈ పరిస్థితుల్లో శ్రీలంకలో శాం తి నెలకొల్పడం కోసంఇండియన్ పీస్ కీపిం గ్ ఫోర్స్ పేరుతో రాజీవ్ గాం ధీహయాం లో ఇండియా సైనిక బలగాలను పంపిం ది.దీనిని ఎల్టీటీ ఈ తీవ్రంగా వ్యతిరేకించిం ది. ఈ నేపథ్యం లోనే బెల్ట్ బాం బు దాడితో రాజీవ్ ను హత్య చేసిం ది.ఆ తర్వాత శ్రీలంకలో ప్రభుత్వం మారడంతో ఎల్టీటీ ఈప్రభావం తగ్గడం మొదలైం ది. వేలుపిళ్లై ప్రభాకరన్హత్య తర్వాత ఎల్టీటీ ఈ పూర్తిగా ఛిన్నాభిన్నమైం ది.
శ్రీలంకలో ప్రశాం తత నెలకొంది.
ఎవరీ శివరాసన్.?
రాజీవ్ హత్యకు ప్లాన్ వేసిం ది శివరాసన్ అనే ఎల్టీటీఈ నాయకుడు.రాజీవ్ ను హత్య చేయడానికి ఎవరేం చేయాలో పక్కాగా స్కెచ్ గీసిన వ్యక్తి ఇతను. బెల్ట్ బాం బు కట్టు కోవడానికి థాను అనే అమ్మాయిని ఎంపిక చేసిం ది కూడా ఇతనే. శ్రీ పెరంబదూర్ లో రాజీవ్ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభకు చేతిలో నోట్ బుక్, పెన్ను పట్టుకుని ఓ జర్నలిస్టు గా హాజరయ్యాడు. బెల్ట్ బాం బు ఆపరేషన్ ను దగ్గరుం డి పర్యవేక్షించాడు. రాజీవ్ హత్య తర్వాత బెం గళూరు పారిపోయాడు. బెం గళూరులో ఉండగానే పోలీసు ఎన్ కౌంటర్ లో చనిపోయాడు.
ఆ రోజు ఏం జరిగింది?
రాజీవ్ గాం ధీ ప్రధాని గా ఉన్నప్పుడు శ్రీలంకలో శాం తి నెలకొల్పడానికి ‘ ఇండియన్ పీస్ కీపిం గ్ ఫోర్స్’(ఐపీకేఎఫ్ ) ను కేంద్ర ప్రభుత్వం పంపిం ది. అయితే శ్రీలంకకు ఐపీకెఎఫ్ రావడం ఎల్టీటీ ఈ అధినేత వేలుపిళ్లె ప్రభాకరన్ కు నచ్చలేదు. దీం తో రాజీవ్ గాం ధీ పై ఎల్టీటీ ఈ పగ పట్టిం ది. హత్య చేయాలని డిసైడ్అయిం ది. శ్రీ పెరంబదూర్ లో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమానికి రాజీవ్ వస్తారని తెలియడంతో పక్కాగా స్కెచ్ వేసిం ది. బెల్ట్ బాం బు థానును రంగంలోకి దింపిం ది. అది 1991 మే 21. సమయం రాత్రి 10గంటల 21 నిమిషాలు. తమిళనాడులోని శ్రీపెరంబదూర్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చారు రాజీవ్ గాం ధీ.థాను అనే ఎల్టీటీ ఈ కార్యకర్త ఒక దండ తీసుకుని రాజీవ్ వైపు కదిలిం ది. దండ వేసి రాజీవ్ పాదాలను తాకడానికి వంగుతూనే, నడుముకు ఉన్న బెల్ట్ బాం బు ను ఆపరేట్ చేసిం ది. అది వపర్ ఫుల్ బాం బు కావడంతోచెవులు పగిలిపోయేలా ఒక పెద్ద పేలుడు సంభవించిం ది. ఈ పేలుడు ధాటికి బెల్ట్ బాం బు కట్టుకున్నథానుతో పాటు 14 మంది చనిపోయారు. వారిలో రాజీవ్ గాం ధీ కూడా ఉన్నా రు. అక్కడే ఉన్న తమిళనాడుకాం గ్రెస్ నేతలు మూపనార్, జయంతి నటరాజన్ వెంటనే రాజీవ్ కోసం వెతకడం మొదలెట్టా రు. రాజీవ్వేసుకున్న షూస్ ను చూసి ఆయన్ను గుర్తుపట్టా రు. పేలుడు ధాటికి రాజీవ్ శరీరం ముక్కలు ముక్కలైం ది.
విడుదల కు అభ్యంతరం లేదు:రాహుల్, ప్రియాంక
సుప్రీం కోర్టు తీర్పు మేరకు తమ తండ్రి రాజీవ్గాం ధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తు న్నఏడుగురి విడుదలకు రాహుల్, ప్రియాం కఓకే చెప్పారు. వారి విడుదలకు తమకెలాం టిఅభ్యం తరం లేదని రాహుల్, ప్రియాం క తేల్చిచెప్పారు. దీం తో నళిని టీం విడుదలకు రాజీవ్కుటుంబం నుం చి కూడా గ్రీన్ సిగ్నల్ లభిం చినట్లయిం ది.
బీజేపీ పై పెరుగుతున్న ఒత్తిడి
రాజీవ్ హత్య కేసులో రెండు దశాబ్దా లకు పైగాజైల్లో మగ్గుతున్న ఏడుగురి విడుదల అంశంప్రస్తు తం తమిళనాడులో హాట్ టాపిక్ గామారిం ది. అన్నా డీఎంకే తో పొత్తు పెట్టుకు-ని ఎన్నికల్లో పోటీ చేస్తు న్న బీజేపీకి ఈ సెగతగిలిం ది. ఒక వైపు ఈ అంశాన్ని డీఎంకే మే-నిఫెస్టోలో పెట్టడంతో అన్నా డీఎంకే కూడావారి విడుదల పై సానుకూలంగా స్పందిం చకతప్పని పరిస్థితి ఏర్పడిం ది. దీం తో మిత్రపక్ష-మైన అన్నా డీఎంకె నుం చి బీజేపీ పై ఒత్తిడిపెరుగుతోంది.