వర్షం ఎఫెక్ట్: ఉప్పల్ బస్టాండ్ దగ్గర భారీ గుంత

వర్షం ఎఫెక్ట్: ఉప్పల్ బస్టాండ్ దగ్గర భారీ గుంత

హైదరాబాద్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి..రోడ్లు అస్తవ్యస్థంగా మారాయి. భారీ వర్షా లతో హైదరాబాద్ లో ని ఉప్పల్ బస్టాండ్ దగ్గర రోడ్డు కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది.. నడిరోడ్డు పై గుంత ఏర్పడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గుర య్యాయి.. అలెర్ట్ అయిన జీహెచ్ ఎంసీ అధికారులు కుంగినరోడ్డుతోపాటు గుంతను  పూడ్చారు. 

రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది.. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే రహదారిపై   ఉప్పల్ బస్టాండ్ దగ్గర నడిరోడ్డు పై పెద్ద గుంత ఏర్పడింది. రోడ్డు కుంగిం ది..వెంటనే స్పందించిన జీహెచ్ ఎంసీ అధికారులు స్పందించి గుంతను పూడ్చి రోడ్డును మరమ్మతు చేశారు.  

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ ప్రభుత్వం అధికారులను అలెర్ట్ చేసింది.. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు.ఫిర్యాదులు అందిన వెంటనే జీహెచ్ ఎంసీ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారుల అలెర్ట్ అవుతున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు.