హుజూర్ నగర్, వెలుగు : అత్యవసర సమయాల్లో సేవలు అందిస్తున్న108 సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. ఆదివారం 108 సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డికి వినతి పత్రం అందజేశారు.
దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ 108 సర్వీసులో పనిచేస్తున్న సిబ్బందికి ఇండ్ల స్థలాలు కేటాయించడంలో ప్రయారిటీ ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నక్కా రవి , కే.శ్రీనివాస్ , నరహరి, అశోక్, మధు, సుధాకర్, రవి బాబు, భిక్షం, రవి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు .