బిటిపిఎస్ అగ్ని ప్రమాదంపై.. అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష

బిటిపిఎస్ అగ్ని ప్రమాదంపై.. అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష

ఖమ్మం జిల్లా: పిడుగుపాటు కారణంగా బిటిపిఎస్ అగ్ని ప్రమాదంపై ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో సమీక్షించారు. మధిర క్యాంపు కార్యాలయంలో ఈరోజు సాయంత్రం జెన్కో థర్మల్  డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లతో అగ్నిప్రమాదంపై వివరాలు ఆరాతీశారు. అగ్ని ప్రమాదంలో వాటిల్లిన నష్టం వివరాలను డిప్యూటీ సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మంటలు వ్యాపించకుండా కేవలం ఒక గంటలోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

సమీపంలో ఉన్న హెవీ వాటర్ ప్లాంట్ మణుగూరు, పినపాక, అశ్వాపురం ల నుంచి ఫైర్ ఇంజన్లను  పిలిపించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు విద్యుత్ అధికారులు డిప్యూటీ సీఎంకు తెలియజేశారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని తనిఖీ చేయడానికి సోమవారం భోపాల్ నుంచి బిహెచ్ఇఎల్ బృందం వస్తున్నట్లు డిప్యూటీ సీఎంకు వెల్లడించిన బిటిపిఎస్ అధికారులు. 

బిహెచ్ఇఎల్ నిపుణులు పరిశీలన అనంతరం జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి అంచనా రానున్నట్లు డిప్యూటీ సీఎంకు అధికారులు  వివరించారు. బి టి పి ఎస్ అగ్నిప్రమాదంపై సమగ్ర నివేదిక తయారుచేసి అందించాలని అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని జెన్కో థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య, చీఫ్ ఇంజనీర్ రత్నాకర్, బిచ్చన్నలను డిప్యూటీ సీఎం ఆదేశించారు.