17న మధ్యాహ్నంఒం టి గంట లోపే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం

 17న మధ్యాహ్నంఒం టి గంట లోపే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం

హైదరాబాద్‌‌‌‌/ఖైరతాబాద్, వెలుగు: గతేడాదిలాగే ఖైరతాబాద్​మహాగణపతిని మధ్యాహ్నం ఒంటి గంట లోపు నిమజ్జనం చేయాలని సిటీ సీపీ సీవీ ఆనంద్​ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. చివరి పూజ అనంతరం 17న ఉదయం 6.30 గంటల కల్లా శోభాయాత్రను ప్రారంభించాలని చెప్పారు. మంగళవారం ఆయన ఖైరతాబాద్​బడా గణేశ్‎ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద్​మాట్లాడుతూ.. గణనాథుడి అనుగ్రహంతోనే తాను మళ్లీ సిటీ కమిషనర్​గా వచ్చానని చెప్పారు.

 గణేశ్ చతుర్థినాడు సీపీగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. డీసీపీగా ఉన్న టైంలో ఉత్సవ కమిటీ సభ్యుడు సుదర్శన్​సమన్వయంతో గణేశ్ఉత్సవాలను ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేశామని గుర్తుచేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బందోబస్తు పెంచుతున్నామని చెప్పారు.

 గతేడాది లాగే ఈసారి కూడా మధ్యాహ్నం లోపు బడా గణేశ్​నిమజ్ఞనం పూర్తిచేస్తామన్నారు. అనంతరం ఖైరతాబాద్‌‌‌‌ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఉత్సవాలు, నిమజ్జనం ఏర్పాట్లపై చర్చించారు. ఉత్సవ కమిటీ చైర్మన్​రాజ్​కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీపీ సీవీ ఆనంద్​సౌత్ జోన్​ఆఫీసులో సెంట్రల్‌‌‌‌ జోన్‌‌‌‌, సౌత్‌‌‌‌ జోన్ పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. 

గణేశ్​నిమజ్జనాలు, మిలాద్​ఉన్ నబీ బందోబస్తుపై సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఏర్నాట్లు చేయాలని ఆదేశించారు. మహా నిమజ్జనం రోజున దాదాపు 40 గంటల పాటు బందోబస్తు కల్పించాల్సి ఉంటుందన్నారను. అన్ని విభాగాల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పాతబస్తీతోపాటు గణపతి మండపాలు, శోభాయాత్రలు జరిగే ప్రాంతాల్లో నిఘా పెట్టాలని సూచించారు.