టాలీవుడ్లో సైడ్ ఆర్టిస్ట్‌గా కెరీర్మొదలుపెట్టి హీరోయిన్గా ఎదిగింది రహస్య గోరక్ (Rahasya Ghorak). ‘రాజావారు రాణిగారు’ లో పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది. అదే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తో ఈ హీరోయిన్ ప్రేమలో ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆ మధ్య కిరణ్ కాశ్మీర్ ట్రిప్‌లో దిగిన ఫొటోలను పోస్ట్ చేయగా..అదే లొకేషన్లో రహస్య కూడా ఫొటోలు దిగింది. అప్పుడే వీరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే టాక్ మొదలైంది. ఇటీవల ఈ హీరో గృహప్రవేశం వేడుకలోనూ ఈ బ్యూటీ కనిపించింది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న దావత్ అనే షో లో కిరణ్ ఫస్ట్ గెస్ట్ గా విచ్చేశాడు. అషూ రెడ్డి హోస్ట్ గా చేస్తున్న ఈ టాక్ షోలో హీరోయిన్ రహస్య గురుంచి అడగగానే.. కిరణ్ మాట్లాడుతూ..ముందు మా ఇద్దరి మధ్య ఏం లేదని.. ఏదైనా ఉంటే మేమే తప్పకుండ చెప్తామని చెప్పుకొచ్చాడు. అషూ రియాక్ట్ అవుతూ..మేము అంటున్నారంటే..ఏదో ఉంది..ఉండే ఉంటదిలే..అని అనగానే..వెంటనే కిరణ్ సిగ్గుపడుతూ.. నేను ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలోను ఎప్పుడు ఇలా దొరికిపోలేదు అంటూ సరదా కామెంట్స్ చేశాడు.
ఈ ఒక్క మాటతో యంగ్ హీరో రహస్య తో..రహస్యంగా సాగించిన వీరి రిలేషన్ నిజమే అని..కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది.ఇక త్వరలో ఈ జంట నుంచి పెళ్లి ముచ్చట వస్తుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ షో ఆద్యంతం నవ్వులతో సాగుతుండగా..ఇందులో కిరణ్ సబ్బవరం పంచులు భలే ఆకట్టుకున్నాయి. మరి మొత్తం ఎపిసోడ్ లో మరేదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటుందేమో చూడాలి.