
అక్షయ తృతీయ సందర్భంగా తెలంగాణలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రజలు ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు ఆలయాలను దర్శించుకుంటున్నారు. బుధవారం (ఏప్రిల్ 30) నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు.
అక్షయ తృతీయను పురస్కరించుకుని తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేసేందుకు బాసరకు భారీగా తరలివచ్చారు భక్తులు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి భారీగా భక్తులు తరలి వచ్చారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో భారీగా అక్షరాభ్యాసం పూజలు నిర్వహిస్తున్నారు.
►ALSO READ | Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజు ఈ ఐదు వస్తువులు కొంటే సంపద పెరుగుతుంది.
అక్షయ తృతీయ శుభ ముహూర్తం ఉండడంతో అమ్మవారి ఆలయంలో చిన్నారులకు అక్షర శ్రీకర పూజలు చేయించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ సుధాకర్ రెడ్డి తెలిపారు.