వేములవాడ, వెలుగు: శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ రాజన్న దేవస్థానంలో నాలుగో రోజు అమ్మవారు కుష్మాండాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను నందీశ్వర, గరత్మంతుడు వాహనంపై పురవీధుల గుండా ఊరేగించారు.
శాకాంబరీ దేవీగా..
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాలలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారు 4వ రోజు శాకాంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.