- చెన్నూరులో కాంగ్రెస్భారీ బైక్ ర్యాలీ
- పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్, తీన్మార్ మల్లన్న
మంచిర్యాల/కోల్‌బెల్ట్/నస్పూర్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా చెన్నూరు నియోజకవర్గం కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జలాల్పెట్రోల్ బంక్ నుంచి పట్టణంలోని పలు వీధుల గుండా వేలాది బైక్‌లతో ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్మల్లన్న పాల్గొని బైక్లునడిపి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
మిషన్ భగీరథతో చుక్కనీరు రాలె
కాళేశ్వరంలో లక్ష కోట్లు, మిషన్ భగీరథలో రూ.60వేల కోట్లు కేసీఆర్ మింగాడని, మిషన్‌భగీరథ వల్ల చుక్క తాగునీరు రాలేదని వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమర్రి మండలం అందుగులపేట, ఊరు మందమర్రి, కాసీపేట మండలం మామిడిగూడ గ్రామాల్లో వంశీకృష్ణ తరఫున ప్రచారం నిర్వహించి ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు. బీఆర్‌ఎస్‌పాలనలో కేసీఆర్ తన అనుచరులకు కాంట్రాక్టులు ఇస్తూ కమీషన్లు తీసుకున్నాడని మండిపడ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డికే అన్ని కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్ల ప్రయోజనం పొందాడని ఆరోపించారు.
మోదీ ధనవంతులను సంపన్నులను చేస్తూ వారికే అండగా ఉన్నాడని, ప్రజలను పట్టించుకోలేదన్నారు. రాహుల్ గాంధీ ఫ్రధాని అయితే ఉపాధి హామీ కూలీలకు రూ.400 ఇస్తామన్నారు. అందుగులపేట, మామిడిగూడ-, ఊరు మందమర్రి వాగులపై బ్రిడ్జిలను నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వంశీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్లీడర్లు కడారి జీవన్ కుమార్, బండి సదానందం, మాజీ సర్పంచులు తిరుపతి రెడ్డి, మల్లయ్య, సందీప్, సలెంద్ర శ్రీనివాస్, మహిపాల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
వంశీకృష్ణకే మాదిగల మద్దతు
పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకే తెలంగాణ మాదిగ సంఘాల మహా కూటమి మద్దతు ఉంటుందని ఆ కూటమి చైర్మన్ పోకల కిరణ్ కుమార్ మాదిగ స్పష్టం చేశారు. శనివారం చెన్నూరు నియోజకవర్గ పరిధిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కిరణ్ మాదిగ హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేండ్లుగా మాదిగలను వంచించిన బీఆర్ఎస్ పార్టీని ఓడించి దళితుల పక్షపాతి కాంగ్రెస్ ను
గెలిపించుకోవాలని కోరారు. మాదిగల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణను 100 రోజుల్లో చేస్తామని చెప్పి పది సంవత్సరాలుగా బీజఏపీ మోసం చేస్తూ వచ్చిందని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని, ఆ పార్టీల అభ్యర్థులను చిత్తుగా ఓడించి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి
గడ్డం వంశీకృష్ణను భారీ మెజర్టీతో గెలిపించాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ కోరారు. నస్పూర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలోని రిజర్వేషన్స్ ను రక్షించడానికి ఈ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు మాదిగ హక్కుల దండోరా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. మందమర్రిలోని లెదర్ పార్క్ ను ప్రారంభించి నిరుద్యోగ మాదిగలకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కాల్పించాలని కోరారు.
ప్రతి నియోజకవర్గంతో పాటు అవసరమైన చోట మాదిగ భవన్ లను ఏర్పాటు చేయాలనే డిమాడ్లు నెరవేర్చేందుకు ఎమ్మెల్యే వివేక్ అంగీకరించారని, మాదిగలందరూ తప్పనిసరిగా వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎంహెచ్‌డీ జిల్లా అధ్యక్షుడు కడారి రమేశ్, నస్పూర్ పట్టణ అధ్యక్షుడు అట్కపురం సమ్మయ్య, నాయకులు రేగుంట లింగయ్య, సుందిల్ల సంతోష్, సంజయ్, బాబన్న, సాగర్ పాల్గొన్నారు.