క్రీమీలేయర్​ పెరగొచ్చట.. ఓబీసీల లెక్కేది?

రిజర్వేషన్లకు మొదట్లో కులాన్నే లెక్కలోకి తీసుకునేవారు. కానీ.. రాబడినీ పట్టించుకోవాలని సుప్రీంకోర్టు 1993లో చెప్పింది. దీంతో అప్పటినుంచి ఇన్​కం ఆధారంగా కూడా కోటా అమలు చేస్తున్నారు. కొత్త కాన్సెప్ట్​కి ‘క్రీమీలేయర్​’ అనే పేరు పెట్టారు. కుటుంబ ఏడాది ఆదాయం ఎంతుండాలనే లిమిట్​ ని ఇప్పటికి నాలుగు సార్లు మార్చారు. ఇకపైన ఓబీసీలకున్న పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచుతారని అంటున్నారు. మరో వైపు.. ఓబీసీ సెన్సస్​పై మహారాష్ట్రలో మొదలైన ఉద్యమం దేశం మొత్తం పాకుతోంది.

ఇతర వెనకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్లలో క్రీమీలేయర్​ అమలు కోసం ప్రస్తుతం పాటిస్తున్న కటాఫ్​​ క్రైటీరియాను మార్చే విషయాన్ని కేంద్ర కేబినెట్​ కొద్ది రోజుల్లో చర్చకు చేపట్టనుంది. ఈ ఇష్యూకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రుల బృందం సంప్రదింపులు జరుపుతోంది. కటాఫ్​ శాలరీ లిమిట్​ని రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచాలనే ప్రపోజల్​ కూడా ఇందులో ఉందని చెబుతున్నారు.

గతంలో ఎన్నిసార్లు మార్చారు?

రిజర్వేషన్లను ఎవరికి ఎంత ఇవ్వాలనే విషయంలో మొదటి నుంచీ ఒక అంశాన్నే ఫాలో అయ్యారు. కులాన్నే బేస్​ చేసుకొని కోటాని డిసైడ్​ చేశారు. ఆ విధానానికి 1993లో బ్రేక్​ పడింది. రాబడినీ లెక్కలోకి తీసుకోవాలని ఇందిరా సాహ్నీ అనే సీనియర్ లాయర్​​ వాదించారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించారు. దీంతో క్రీమీలేయర్ అనే కొత్త పద్ధతి తెరపైకి వచ్చింది. కుటుంబ ఏడాది ఆదాయం రూ. లక్ష లోపు ఉన్నోళ్లకే రిజర్వేషన్లనే కటాఫ్​ పెట్టారు. ఆ క్రైటీరియాని ఇప్పటివరకు నాలుగు సార్లు మార్చారు.

2004లో రూ.2.5 లక్షలకు, 2008లో రూ.4.5 లక్షలకు, 2013లో రూ.6 లక్షలకు, 2017లో రూ.8 లక్షలకు పెంచారు. నిజానికి ఈ పరిమితిని ప్రతి మూడేళ్లకోసారి మార్చాలనే రూలున్నా గత ప్రభుత్వాలు పాటించలేదు. మోడీ సర్కారు మాత్రం ఈసారి లేట్​ చేయొద్దనుకుంటోంది. రూ.8 లక్షలకు పెంచి మూడేళ్లు కావస్తుండటంతో ఇప్పుడు దీనిపై ఫోకస్​ పెట్టింది. లేటెస్ట్​గా రూ.12 లక్షలకు చేర్చాలని చూస్తున్నారు. దీంతోపాటు మరో మూడు అంశాల్లోనూ మార్పులు చేపట్టాలని ప్రయత్నిస్తున్నారు. దీనికోసం మంత్రుల బృందాన్నీ ఏర్పాటు చేశారు.

ఏమేం మార్పులు చేస్తారు?

కుటుంబ ఏడాది మొత్తం రాబడిని లెక్కించేటప్పుడు శాలరీతోపాటు ట్యాక్స్​ పరిధిలోకి వచ్చే అన్ని ఆదాయాలనూ లెక్కలోకి తీసుకోవాలనుకుంటున్నారు. ఈసారి రెండు సీలింగ్​లు పెడతారనే వార్తలూ వచ్చాయి. పట్టణ ప్రాంతాల వారికి రూ.12 లక్షల్లోపు, పల్లె ప్రాంతాల వారికి రూ.9 లక్షల్లోపు రాబడి ఉంటేనే రిజర్వేషన్లకు అర్హులనే రూలు పెట్టనున్నట్లు ప్రచారం జరిగింది. 2011లో జాతీయ బీసీ కమిషన్​ ఇచ్చిన ప్రపోజల్​ మేరకు ఇలా చేస్తారనుకున్నా ప్రభుత్వం ససేమిరా అన్నది. దీనికితోడు 25 ఎకరాలకుపైగా భూమి ఉండి, అందులో సుమారు 10 ఎకరాలు వ్యవసాయ భూమి అయితే దాన్నీ పరిగణనలోకి తీసుకుంటారని చెబుతున్నారు. ​

జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే ఓబీసీలనూ ప్రత్యేకంగా చేర్చాలనే డిమాండ్​ ఎప్పటి నుంచో ఉంది. ‘జన గణన–2011’కి ముందు కూడా ఈ ప్రస్తావన వచ్చినా యూపీఏ గవర్నమెంట్​ పట్టించుకోలేదు. ఈ అంశాన్ని తమ దృష్టికి లేటుగా తెచ్చారని తప్పుపట్టింది. ఎన్యూమరేషన్​ ప్రిపరేషన్​​ కోసం అప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఓబీసీ ఇష్యూని పరిగణనలోకి తీసుకుంటే బడ్జెట్​ పెరుగుతుందని, మ్యాన్​ పవర్​ మరింత కావాలని చెప్పుకొచ్చింది. ‘సోసియో ఎకనమిక్​ అండ్​ క్యాస్ట్​ సెన్సస్​–2011’లోనూ ఓబీసీలను చేర్చలేదు.

పార్టిషన్ ముందు నుంచీ ఇదే పరిస్థితి
ఫస్ట్​ సెన్సస్​ కౌంటింగ్​ 1872లో జరిగింది. 1931 దాక బ్రిటిష్​వాళ్లు ఈ ఎక్సర్​సైజ్​ని రెగ్యులర్​గా చేశారు. ఓబీసీల్ని ఆ లిస్టులో సెపరేట్​గా చూపారు. ఓబీసీ జనాభాను ప్రత్యేకంగా చెప్పటం అదే చివరిసారి. అప్పట్లో మొత్తం జనాభాలో ఆ సామాజి క వర్గాలవారు 52 శాతం మంది ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ లెక్కను మార్చనే లేదు. కాబట్టి ఓబీసీ పాపులేషన్​కి సంబంధించిన లేటెస్ట్​ ఇన్ఫర్మేషన్​ లేదనే చెప్పాలి.

90 ఏళ్ల కిందటి డేటానే దిక్కు

దేశంలో అదర్​ బ్యాక్​వర్డ్​ క్లాసెస్(ఓబీసీలు) ఎంత మంది ఉన్నారంటే 52 శాతమని ఠక్కున చెబుతాం. ఆ డేటా ఎప్పటిదో తెలుసా?. దాదాపు 90 ఏళ్ల కిందటిది. దేశానికి ఇండిపెండెన్స్​ రాకముందు 1931లో తెల్లోళ్లు ఇచ్చారు. ఇప్పటికీ దాన్నే ఫాలో అవుతున్నాం. సమ్మర్​లో జనాభా లెక్కలు తీయనున్న నేపథ్యంలో రిజిస్టర్​లో ఓబీసీలకు స్పెషల్​ కాలమ్​ పెట్టాలని కోరుతున్నారు. కానీ ఈసారీ ఆ కోరిక తీరే ఛాన్స్​ లేదు. మహారాష్ట్రలో గతేడాది చేపట్టిన శాంపిల్​ సెన్సస్ సర్వేలోనే ఇది తేలిపోయింది. ఆ ప్రొఫార్మాలో ఓబీసీ సెక్షన్ కనిపిస్తే ఒట్టు. ​​

మహారాష్ట్రలో ఉద్యమం

‘సెన్సస్​–2021’లోనూ ఓబీసీల కాలమ్​ లేదనే విషయం పోయినేడాదే తేలిపోవటంతో మహారాష్ట్రలో ఉద్యమం మొదలైంది. తర్వాత రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, బీహార్​ తదితర రాష్ట్రాలకూ పాకింది. సోషల్​ మీడియా వేదికగా ఊపందుకుంది. ఈ మూమెంట్​ని లాయర్​, యాంటీ క్యాస్ట్​ యాక్టివిస్ట్ అంజలీ సాల్వే విటంకర్​ మొదలుపెట్టారు. త్వరలో ప్రారంభం కానున్న ఎన్యూమరేషన్​కి సహకరించే ప్రస్తక్తే లేదని, ఓబీసీలు దీనికి సపోర్ట్​ చేయాలని పిలుపు ఇచ్చారు. దీంతో ముంబై సమీప థానే, పల్ఘర్​ జిల్లాల్లోని 100కు పైగా గ్రామాల్లో ఈ మేరకు తీర్మానాలు చేశారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో ఓబీసీ కేటగిరీ కింద 346 క్యాస్ట్​లు ఉన్నాయని ఈ ఉద్యమ కార్యకర్తలు చెబుతున్నారు. అయితే సరైన సంఖ్య జనగణనతోనే తేలుతుందని అంటున్నారు. బీఆర్ అంబేద్కర్​ ఎస్సీ, ఎస్టీలతోపాటు ఓబీసీలనూ అణగారిన వర్గంగానే పరిగణనలోకి తీసుకొని రాజ్యాంగంలో ప్రత్యేక ప్రొవిజన్లను పొందుపరిచిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఓబీసీలు పొలిటికల్​గా ఏకతాటిపైకి రాకపోవటంతో ఆర్టికల్–340 ఇస్తున్న ప్రాథమిక హక్కులు తమకు దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

see also: మార్చి 31 వరకు కరోనా సెలవులు

ఒక్కొక్కరు ఆరుగుర్ని కనండి