అమ్మ యాదిలో అన్నదానం : 10 ఏండ్ల కొడుకు 550 మందికి అన్నదానం

యాదాద్రి, వెలుగు : అమ్మ జయంతి సందర్భంగా 10 ఏండ్ల కొడుకు 550 మంది అనాథలు, వృద్ధులకు అన్నదానం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాకు చెందిన ధనాల శ్రీనివాస రెడ్డి, వారిజ దంపతుల కూతురు స్వాతి కొన్నేళ్ల కింద చనిపోయింది. ఈమెకు భర్త వెంకటేశ్వర్‌‌ రెడ్డి, కొడుకు శంతన్‌ రెడ్డి ఉన్నారు. అప్పటి నుంచి శంతన్ రెడ్డి తల్లి జయంతి రోజున సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో 5వ తరగతి చదువుతున్న ఇతను బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని ‘అమ్మ నాన్న’ ఆశ్రమంలో 550 మంది అనాథలు, వృద్ధులకు అన్నదానం చేసి, దుస్తులు అందించాడు.