వరంగల్ జిల్లా: వర్ధన్నపేట మండలం బండౌతాపురం గ్రామంలో పిడుగుపడి ముగ్గురు యువకులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దసరా పండగ సందర్భంగా గ్రామ శివారులో స్నేహితులంతా కలిసి పార్టీ చేసుకుంటుండగా ఉరుములు మెరుపులతో పిడుగుపడింది. పిడుగుపాటు ధాటికి మరుపట్ల సాంబరాజు, బాలగాని హరికృష్ణ, శివ కృష్ణ అనే యువకులు మృతిచెందగా మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలాన్ని సందర్శించి గాయపడిన వారిని వర్థన్నపేట ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఊరు.. ఊరంతా పండుగ సంబరంలో మునిగి తేలుతున్న తరుణంలో పిడుగుపడి ముగ్గురు మృతిచెందిన ఘటన విషాదం రేపింది.