మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు, వెంకటస్వామిలు పెద్దపల్లి ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని బెల్లపల్లి ఎమ్మె్ల్యే వినోద్ అన్నారు. శ్రీపాదరావు 25వ వర్థంతి సందర్భంగా శనివారం మంథనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు పలువురు నివాళులు అర్పించారు. 46 సంవత్సరాలపాటు స్వర్గీయ శ్రీపాదరావుకు వెంకటస్వామితో మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయని ఎమ్మె్ల్యే వినోద్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకట స్వామి, గడ్డం వినోద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి పార్టమెంట్ నియోజకర్గంలో వెంకటస్వామి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని.. యువకుడు గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే కోరారు. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే కష్టపడి కార్యకర్తలు పనిచేసి కాంగ్రెస్ ను గెలిపించారో.. అదేవిధంగా పనిచేసి గడ్డం వంశీ కృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.10 సంవత్సరాలు బీఆర్ఎస్ నాయకులు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని లక్షణ్ అన్నారు.