వరంగల్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

వరంగల్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

వరంగల్ : మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ సిటీలో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలందరూ సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. 

బస్సు రూట్ల వివరాలు..

* ములుగు, పరకాల నుంచి వచ్చే బస్సులు, ఇతర వాహనాలు ములుగు రోడ్డులోని పెద్దమ్మగడ్డ, కేయూసీ జంక్షన్, సీపీవో నుంచి అంబేడ్కర్ జంక్షన్ మీదుగా హనుమకొండ బస్టాండ్ కు చేరుకోవాలి

* హనుమకొండ నుంచి ములుగు, కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు శ్రీదేవి ఏషియన్మాల్, అంబేడ్కర్ సెంటర్, సీపీవో పాయింట్ నుంచి కేయూసీ మీదుగా వెళ్లాలి

* హనుమకొండ బస్టాండ్ నుంచి నర్సంపేట, తొర్రూరు, భద్రాచలం వైపు వెళ్లే వాహనాలు బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్డు మీదుగా వెళ్లాలి

* వరంగల్ బస్టాండ్ నుంచి పోస్టాఫీస్, శివనగర్, పోతనరోడ్డు, సంతోషిమాత దేవాలయం, సీఎస్ఆర్ గార్డెన్, అదాలత్ నుంచి హనుమకొండ, ఇతర ప్రాంతాలకు వెళ్లాలి

* ములుగు క్రాస్ రోడ్డు నుంచి హనుమకొండకు.. అలంకార్, కాపువాడ మీదుగా వెళ్లాలి

* హనుమకొండ నుంచి వరంగల్ వైపునకు.. మార్కజీ పాఠశాల, కొత్తూర్ జెండా మీదుగా పెద్దమ్మగడ్డ ద్వారా చేరుకోవాలి