వెలుగు, హైదరాబాద్/మెహిదీపట్నం/సికింద్రాబాద్/శంషాబాద్/షాద్నగర్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం గ్రేటర్ సిటీలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమో నారాయణాయ, గోవింద నామ స్మరణతో ఆలయాలు మార్మోగాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు.
బంజారాహిల్స్ రోడ్ నం.12లోని వెంకటేశ్వరస్వామి ఆలయం, జగన్నాథ ఆలయం, జూబ్లీహిల్స్ లోని టీటీడీ ఆలయం, జియాగూడలోని రంగనాథ స్వామి, కొత్తపేటలోని అష్టలక్ష్మి ఆలయం, శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమం దివ్యసాకేతం, చిలుకూరి బాలాజీ ఆలయం, నర్కుడలోని అమ్మపల్లి సీతారామాలయం, షాద్నగర్ లోని జానంపేట వెంకటేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రధానాలయాల్లో దర్శనాలకు మూడు, నాలుగు గంటల సమయం పట్టింది. -