డబుల్ రోడ్డు వేయాలంటూ రాస్తారోకో

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గురుకుల కొండాపూర్ --గుండ్లపల్లి మధ్య ఉన్న రహదారిపై స్థానికులు రాస్తారోకో చేపట్టారు. గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. వీరికి తెలంగాణ వైఎస్ఆర్టీపీ నేతలు మద్దతు తెలిపారు. గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు రూ.71 కోట్లతో డబుల్ రోడ్డు మంజూరు అయ్యి.. రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పనులు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్లు తవ్వి వదిలేయడంతో దుమ్ము, ధూళితో ప్రజలు, ప్రయాణికులు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పనులు చేపట్టకపోతే వివిధ గ్రామాల ప్రజలతో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.