గాదె వాగుపై గుంతలను  పూడ్చిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

కొత్తగూడ, వెలుగు : ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధిని ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కొత్తగూడ నుంచి నర్సంపేట కు వెళ్ళే రోడ్డుపై  గాదె వాగు దగ్గర ప్రమాదకరంగా ఉన్నగుంతలను ఆమె గురువారం పూడ్చారు.కొత్తగూడ  నుంచి నర్సంపేట కు వెళ్ళే దారిలో  గుంతలున్నాయని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఇటీవల మృతిచెందిన కుటుంబాలను ఆమె పరామర్శించారు.