
హైదరాబాద్ : రెండోరోజు గురువారం (ఆగస్టు 24న) మోకిలా భూముల వేలం ప్రక్రియ ముగిసింది. రెండో రోజు 60 ప్లాట్స్ వేలం వేయగా రూ.132 కోట్ల72 లక్షల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. బుధవారం రోజు (ఆగస్టు 23న) 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122 కోట్ల 42 లక్షల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే.
మొదటి రోజు ఒక గజానికి అత్యధికంగా లక్ష రూపాయలకు అమ్ముడు పోయింది. రెండో రోజు మాత్రం ఒక గజానికి అత్యధికంగా రూ. 75 వేలు, అతి స్వల్పంగా రూ.56 వేలు, యావరేజ్ గా రూ.63 వేలకు అమ్ముడుపోయింది.
గురువారం మార్నింగ్ సెషన్ లో 30 ప్లాట్స్ వేలం ద్వారా రూ.68 కోట్ల 3 లక్షల రూపాయలు రాష్ర్ట ప్రభుత్వానికి ఆదాయం లభించింది. ఈవింగ్ సెషన్ లో 30 ప్లాట్స్ వేలం ద్వారా రూ.63 కోట్ల 69 లక్షల ఆదాయం వచ్చింది. రెండో రోజు 60 ప్లాట్ల వేలం ద్వారా మొత్తం రూ.132 కోట్ల 72 లక్షల ఆదాయం వచ్చింది. మూడో రోజు అంటే శుక్రవారం రోజు (ఆగస్టు 25న) మోకిలా ఫేస్ -2 భూములను వేలం వేయనున్నారు. మరో 60 ప్లాట్స్ ను హెచ్ఎండీఏ అధికారులు వేలం వేయనున్నారు.