కిక్కిరిసిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం

స్వామి వారి దర్శనానికి 6 గంటలు

కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు

వేములవాడ, వెలుగు : కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా రాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శివనామ స్మరణతో వేములవాడ మార్మోగింది. తెల్లవారుజామునుంచి ఆలయం ముందు రావిచెట్టు దగ్గర భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. కోరిన కోరికలు తీరాలని స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. బాలాత్రిపురదేవి అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. 171 మంది దంపతులు స్వామి వారి కల్యాణంలో పాల్గొన్నారు. సత్యనారాయణ వ్రతం, చండీహోమం, మహ రుద్రాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్ గఢ్​ ల నుంచి భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టింది.