
న్యూఢిల్లీ: ఇప్పుడంటే పలుచటి స్మార్ట్‌టీవీలు, ట్యాబ్‌లు వచ్చేశాయ్. కానీ 1980లలో టీవీ అంటే లగ్జరీ! అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలే దిక్కు. నో కలర్ టీవీ! సరిగ్గా 40 ఏళ్ల క్రితం..అంటే 1982 ఏప్రిల్ 25న రంగుల టీవీ ఇండియాకు వచ్చేసింది. ఇందుకోసం పెద్ద తతంగమే నడిచింది. ఫారిన్ నుంచి కలర్ టీవీల దిగుమతులకు ఒప్పుకోవాలా.. వద్దా ? అనే విషయమై పార్లమెంటులో, ప్రభుత్వంలో గంటల కొద్దీ చర్చలు నడిచాయి. అయితే అదే ఏడాది అక్టోబరులో ఏషియన్ గేమ్స్ ఉండటంతో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాత్రికి రాత్రే పర్మిషన్లు ఇచ్చింది. కేవలం మూడే కంపెనీల నుంచి దిగుమతి చేసుకోవాలని షరతు పెట్టింది. కలర్ టీవీలు వద్దంటూ పార్లమెంటులో అపోజిషన్ పార్టీలు నిరసన తెలిపాయి.