పెద్దపల్లిలో ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి..ఆటో డ్రైవర్లు రాస్తారోకో

పెద్దపల్లి, వెలుగు: ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్​చేస్తూ జూలపల్లి మండల కేంద్రంలో గురువారం ఆటో డ్రైవర్లు రాస్తారోకో చేశారు. అనంతరం  తహసీల్​ఆఫీస్​ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో తాము ఉపాధి కోల్పోయామన్నారు.

ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు జీవనభృతి అందించాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షుడు మద్దెల నరేశ్‌‌, లీడర్లు మహేందర్, వెంకటేశ్‌‌, ప్రభాకర్, తాజోద్దీన్, సాయి, ఆయూబ్, మల్లేశం, మహేందర్ పాల్గొన్నారు