కేసీఆర్ను ఇంటికి పంపిస్తేనే... ప్రజలు బాగుపడతారు: రఘునందన్ రావు

కేసీఆర్ను ఇంటికి పంపిస్తేనే... ప్రజలు బాగుపడతారు: రఘునందన్ రావు

బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల బ్రతుకులు ఏమి మారలేవని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని అచ్చుమాయిపల్లి హనుమాన్ దేవాలయంలో రఘునందన్ రావు గురువారం(అక్టోబర్ 12) ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి దుబ్బాకలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  రఘునందన్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుంటుంబం తప్ప, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదని బిఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో  రాష్ట్రంలో ఉన్నట్టువంటి నిరుద్యోగులు,  రైతన్నలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు.  రాష్ట్రం వస్తే తమ బ్రతుకులు బాగు పడతాయని అశ పడ్డారు.. కానీ వాళ్ళ బ్రతుకులు ఏమి బాగు పడలేదని చెప్పారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే,  ప్రజల జీవితాలు బాగు పడలంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఇంటికి పంపించాలన్నారు. కెసిఆర్ ను ఇంటికి పంపించే ఆలోచనను అ హనుమంతుడు ప్రజలకు కల్పించాలని కోరుకుంటున్నట్లు రఘునందన్ రావు పేర్కొన్నారు.