హీరా గ్రూప్లో మరోసారి ఈడీ సోదాలు..ఏకకాలంలో పదిచోట్ల రైడ్స్

హైదరాబద్: భారీ రాబడి, డిపాజిట్ల పేరుతో వందల కోట్లు సేకరించిన హీరాగ్రూప్ సంస్థలపై శనివారం ఆగస్టు 3, 2024 ఈడీ అధికారులు మరోసారి రైడ్స్ చేశారు. ఏకకాలంలో హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నం 10, ఎమ్మెల్యే కాలనీ, టోలీ చౌకి తోపాటు 10చోట్ల సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని హీరా గ్రూప్ కంపెనీస్ డైరెక్టర్ నౌహీరాషేక్ ఆఫీస్, ఇళ్లతో పాటు సంస్థ డైరెక్టర్లు, సీఈవోల ఇళ్లలోనూ ఈ రెయిడ్స్ చేశారు. కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు ఈడీ అధికారులు సీజ్ చేశారు. 

ALSO READ | 30 రోజుల్లో.. 2 కోట్ల 43 లక్షలు కొట్టేశారు.. ఒక్క సంగారెడ్డి వ్యక్తి నుంచే..!

 ఈ సోదాల్లో భారీగా నగదు ఈడీ అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మూడు దశల్లో దాదాపు రూ. 400 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. భారీ రాబడులు, బంగారం డిపాజిట్, డిపాజిట్ల పేరుతో వందల కోట్లు సేకరించనట్లు  హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ నౌహీరా షేక్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా 60కి పైగా కేసులు ఉన్నాయి.