మరోసారి ఫ్లెక్సీ వార్..రూ.6.5 కోట్లతో  జంక్షన్స్ డెవలప్ చేస్తం

    
కరీంనగర్ టౌన్,  వెలుగు:
 కరీంనగర్ ను గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుందామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  ఆదివారం స్థానిక కేబుల్ బ్రిడ్జితో పాటు తెలంగాణ చౌక్ లోని జంక్షన్ అభివృద్ధి పనులను మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రూ.6.5 కోట్ల వ్యయంతో 13 జంక్షన్లతో పాటు చారిత్రక, ఆధ్యాత్మిక, ధార్మిక ఘట్టాలతో కూడిన విగ్రహాలతో జంక్షన్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కేబుల్ బ్రిడ్జి,అప్రోచ్ రోడ్డు పనులతో పాటు తెలంగాణ చౌక్ జంక్షన్ నిర్మాణ పనులను  వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  

కార్యక్రమంలో  కార్పొరేటర్ వాల రమణారావు,డీఈ మసూద్ అలి,అర్భన్ బ్యాంకు డైరెక్టర్ కర్రసూర్యశేఖర్,తదితరులు పాల్గొన్నారు.