ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. తాజాగా ఇవాళ (సెప్టెంబర్ 25) 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలకమైన లా అండ్ ఆర్డర్ ఐజీగా సిద్ధార్థ్ కౌశల్, ఇంటలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప, అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హా, సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్‌లాల్, పీ అండ్ ఎల్ ఐజీగా రవిప్రకాష్, ఇంటలిజెన్స్ ఐజీగా పీహెచ్డీ రామకృష్ణ, డీఐజీ (అడ్మిన్)గా అమ్మిరెడ్డి, రోడ్ సేఫ్టీ డీఐజీగా విజయరావు, విశాఖ లా అం డ్ ఆర్డర్ డీసీపీగా మేరి ప్రశాంతి, కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక, ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ ప్రిన్సిపాల్‌గా రాధిక నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లడ్డూ వ్యవహారం కాకరేపుతోన్న వేళ భారీగా ఐపీఎస్ లు ట్రాన్స్ ఫర్ కావడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.