కొమురంభీం జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. కాగజ్ నగర్ మండలం అంకుశాపూర్ సమీపంలో ఇవాళ రోడ్డుపై వెళ్తున్న వాహనాదారునికి పెద్దపులి కనిపించింది. పులిని చూసిన వాహనదారుడు భయపడి బైక్ పై నుంచి కింద పడ్డాడు. దీంతో సల్ప గాయాలయ్యాయి.
పులిని చూసి భయపడి బైకు పై నుంచి కింద పడ్డ వ్యక్తిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. పెద్దపులి సంచారం గురించిన వార్త సోషల్ మీడియా ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు క్షణాల్లో తెలిసిపోయింది. దీంతో పొలం పనులకు, అడవిలో పశువులను మేపుకునేందుకు వెళ్లే వారు భయాందోళనకు గురవుతున్నారు.