
హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. తాజాగా ఐదుగురు సీనియర్ ఐపీఎస్‌లకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని ట్రాన్స్ఫర్ చేసి ఆయనను విజిలెన్స్ అండ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డీజీగా నియమించింది. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న సీవీ ఆనంద్‌ను హైదరాబాద్ కమిషనర్‌గా అపాయింట్ చేసింది. సీవీ ఆనంద్ స్థానంలో ఏసీబీ డీజీగా విజయ్ కుమార్‌ను నియమించింది. పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా మహేష్ భగవత్‍కు, పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం.రమేష్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఇవాళ (సెప్టెంబర్ 7) ఉత్తర్వులు జారీ చేశారు. సీన్సియర్ ఆఫీసర్‌గా పేరున్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.