టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్రు

యాదాద్రి, వెలుగు: పోలీసులు టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోపించారు. అలాంటి వారి లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడీ చేస్తున్నామని, బీజేపీ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పడగానే వారి లెక్క తేలుస్తామని హెచ్చరించారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో కల్వకుంట్ల కవిత పేరు బయటపడడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారని విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా యాత్ర ఆగే ప్రసక్తే లేదన్నారు. అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాకు చెప్పులు తొడిగితే ఆత్మగౌరవం తాకట్టు పెట్టినట్టా ? అని ప్రశ్నించారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోనియా కాళ్ల మీద పడ్డప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా ? అని నిలదీశారు. కేసీఆర్​ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. దాసరి మల్లేశం, నందకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాయ దశరథ, పడమటి జగన్మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, చందా మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గుప్తా, రత్నపురం బలరాం, ఉపేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. సంజయ్‌‌ని కలిసిన భిక్షమయ్యగౌడ్‌‌ గృహ నిర్బంధంలో ఉన్న బీజేపీ స్టేట్‌‌ చీఫ్‌‌ బండి సంజయ్‌‌ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌‌ కలిశారు. మంగళవారం కరీంనగర్‌‌లోని ఇంటికి వెళ్లి సంజయ్‌‌ని పరామర్శించారు.

టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే...

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : తెలంగాణలో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. పోలీసులు, రౌడీలను అడ్డు పెట్టుకొని టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలన చేస్తోందని ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడికి నిరసనగా ధర్మదీక్ష తలపెట్టిన బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అక్రమంగా అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితం అయ్యారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో అంబళ్ల నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కుందూరి కోటిరెడ్డి, ఇంటి రవి, పత్తిపాటి విజయ్, తోట శేషు, వీరబాబు పాల్గొన్నారు.

సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిరసనగా ఆందోళనలు

వెలుగు  నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిరసిస్తూ మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీ లీడర్లు ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి, నిరసన దీక్షల్లో కూర్చోవడంతో పాటు పలు చోట్ల రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కాంలో ఇరుక్కోవడంతో, ప్రజల దృష్టిని మళ్లించేందుకే సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర చేస్తున్న  బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం సరికాదన్నారు. పలు చోట్ల దిష్టిబొమ్మలు దహనం చేస్తున్న బీజేపీ లీడర్లను పోలీసులు అడ్డుకొని స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

రజాకార్లను మరిపిస్తున్న కేసీఆర్‌‌ పాలన

సూర్యాపేట, వెలుగు : సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలన రజాకార్లను మరిపిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. అక్రమంగా అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెంటన విడుదల చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజలకు ఇబ్బంది కలగకుండా దీక్ష నిర్వహిస్తున్న బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం సరికాదన్నారు. తెలంగాణలో కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని పేర్కొన్నారు.

బీజేపీలో చేరికలు

మునుగోడు, వెలుగు : నల్గొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెం గ్రామానికి చెందిన పలువురు మంగళవారం బీజేపీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి కుటుంబ పాలన అంతం చేయడం బీజేపీతోనే సాధ్యమన్నారు. పార్టీలో చేరిన వారిలో గుర్రం సత్తయ్య, గుర్రం వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైదులు ఉన్నారు.