హైదరాబాద్: 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్లకు మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు -ఫిరాయింపులు ప్రోత్సహించేలా ఉన్నాయని అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ ‘25 మంది మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
కానీ వేరే పార్టీల శాసససభ సభ్యులను తాము చేర్చుకోం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అంటున్నరు. ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. కేసీఆర్పై మంత్రులు ఇష్టారీతిన మాట్లాడుతున్నరు. బీఆర్ఎస్ పవర్‌లోకి వచ్చాక వడ్డీతో సహా మీకు తిరిగిస్తం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం’ అని స్పష్టం చేశారు.