ఎన్నికలు ఐపోగానే హామీలు నెరవేరుస్తా : మంత్రి మల్లారెడ్డి

ఎన్నికలు ఐపోగానే ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తానని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఆరెగూడెం పబ్లిక్ కేసీఆర్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అసలు మునుగోడులో బీజేపీ ఉందా అన్న ఆయన.. ఉన్న పదవిని వదులుకొని రాజగోపాల్ బీజేపీలోకి పోయిండని విమర్శించారు. బీజేపీతో ఏమైనా పోయేది ఉందా అని మండిపడ్డారు. పేద ప్రజలకు లాభం చేసింది టీఆర్ఎస్ పార్టీ నేనన్న మంత్రి... బీజేపీకి ఓటేస్తే మోటర్లకు మీటర్లేనని స్పష్టం చేశారు. 

మంత్రికి నిరసన సెగ

ప్రచారంలో భాగంగా ఆరెంగూడెంకు వెళ్లిన మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. అక్కడికి వెళ్లిన మంత్రిని గ్రామ సమస్యలపై పబ్లిక్ నిలదీశారు. ఈ నేపథ్యంలో అక్కడి పొలాలకు బాట, కరెంట్ స్థంభాలు వేయిస్తానని, వేసేటోడు తిరుపతికి పోయిండని మంత్రి మల్లారెడ్డి బదులిచ్చారు. ఎన్నికలు పూర్తి కాగానే అన్ని హామీలు నెరవేరుస్తానని, 'మీ పిల్లలను నేనే చదివిస్తా, మిమ్మల్ని హాస్పిటల్ కు తీసుకెళ్లేది నేనే' అంటూ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.