టీ 20 ప్రపంచ కప్​ చివరిరోజు ... ONDC 3.7 లక్షల ఫుడ్​ డెలివరీలు

టీ 20 ప్రపంచ కప్​ చివరిరోజు ... ONDC 3.7 లక్షల ఫుడ్​ డెలివరీలు

ఏదైనా ఈవెంట్​ జరిగినా.. నలుగురు యూత్​ ఒకచోట కలిసినా.. ఏదైనా ప్లే గ్రౌండ్​ వెళ్లినా సరే జనాలు ఆన్​ లైన్​ లో ఫుడ్​ ఆర్డర్​ పెట్టుకుంటారు.  అలానే  టీ 20 ప్రపంచకప్​ ఫైనల్​ జరిగిన రోజు  ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) లో 3 లక్షల 74 వేల ఆర్డర్లు వచ్చాయి.  ముఖ్యమైన ఈవెంట్లు జరిగేటప్పుడు ఎక్కువుగా ఆర్డర్లు వస్తాయని ONDC తెలిపింది. 

మే 2024లో, ONDC రిటైల్ ... రైడ్-హెయిలింగ్ విభాగాల్లో 8.9 మిలియన్ లావాదేవీల ఆల్-టైమ్ హైని నమోదు చేసింది. రిటైల్ విభాగంలో ONDC ఏప్రిల్లో 3.59 మిలియన్ల నుండి మేలో 5 మిలియన్ ఆర్డకు పెరిగాయి.   ONDCనెట్వర్క్ ఈ నెలలో 2లక్షల  రిటైల్ లావాదేవీలు ఒకేరోజు జరిగాయి. దేశవ్యాప్తంగా  ONDC నెట్‌వర్క్ పెరుగుతున్న స్వీకరణను హైలైట్ చేసింది.  ఇ-కామర్స్ ఆన్​ లైన్​ ఫుడ్​ వ్యాపారం ​  దేశవ్యాప్తంగా వినియోగదారుల కోసం డిజిటల్ షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంని తెలిపింది.

ఆన్​ లైన్​ లో ఆర్డర్​ పెట్టేందుకు బ్రౌజింగ్​ చేయడానికి  WhatsApp లో  UIని ఉపయోగించేందుకు   ఎనేబుల్ చేయడానికి ONDC 'Gupshup' ద్వారా దాని కొనుగోలుదారు యాప్​ ఉంది.  ONDC నెట్​ వర్క్​ ద్వారా కిరాణా, ఫుడ్​ డెలివరీ కేటగిరీలు 1 మిలియన్ ఆర్డర్ మార్కును దాటాయి. కిచెన్​ కు సంబంధించి 6 లక్షల 30 వేల ఆర్డర్లు.. ప్యాషన్​ కు సంబంధించి 3 లక్షల 30 వేలు, రిటైల్​ సబ్​ కేటగిరీకి సంబంధించి 2 మిలియన్​ లవరకు ఆర్డర్లు వచ్చినట్లు సీఈవో టీ కోశి తెలిపారు.